Venky Anil 3: హ్యాట్రిక్‌ హిట్‌పై వెంకీ అనిల్‌ గురి.. పూజా కార్యక్రమాలతో షురూ

Wed, 03 Jul 2024-3:41 pm,

Venky Anil 3: ఎఫ్‌ 2, ఎఫ్‌ 3 సినిమాలతో దగ్గుబాటి వెంకటేశ్‌, అనిల్‌ రావిపూడి రెండు భారీ హిట్లు పొందారు.

Venky Anil 3: వీరిద్దరి కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతున్నది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు బుధవారం ప్రారంభమయ్యాయి.

Venky Anil 3: హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాఘవేంద్ర రావు, దిల్‌ రాజు, అల్లు అరవింద్‌ తదితరులు హాజరయ్యారు.

Venky Anil 3: ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా.. ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

Venky Anil 3: తెలంగాణ సంగీత దర్శకుడు బీమ్స్‌ సిసిరిలియో ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Venky Anil 3: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌ రాజు, శిరీశ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ కథ కూడా భార్యాభర్తల నేతృత్వంలో హాస్యం ప్రధానంగా తెరకెక్కుతోందని సినీ పరిశ్రమలో టాక్‌.

Venky Anil 3: ఎఫ్‌ 2, 3 సిరిస్‌లతో హిట్‌ కొట్టిన ఈ క్రేజీ కాంబినేషన్‌ మూడో హిట్‌ కూడా కొడుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link